మేషరాశి గోచర ఫలితములు

జనవరి 1, 2022  నుండి జనవరి 14, 2022 వరకు గల గ్రహస్థితుల ద్వాదశ రాశుల వారికి గ్రహ గోచార ఫలితాలు.

మేషరాశి

మేషరాశి వారికి జనవరి 1-జనవరి 14 లోపు దినములలో రవి గ్రహం 9వ ఇంట అనగా ధనూరాశిలో ఉండుట వల్ల వ్యతిరేక ఫలితాలను ఇచ్చుట తథ్యం. రవి గ్రహం ఈ మేషరాశి వారిని ధైన్యముగా ఉంచును. ఈ పక్షం రోజులు వీరి జీవన విధానం ధైన్యముగా దీనముగా చేయును. ఉష్ణప్రకోప సంబంధమైన అనారోగ్యం చేయును, మంచి పనులకు అంతరాయం వాటిల్లును. ఆ కార్యము చెడును.

బుధ గ్రహము దశమ స్థానములో సంచరించుట వల్ల మంచి మేలు జరుగును, వీరి శత్రువులకు ఈ కాలములో నాశనం వాటిల్లును. శతృ నాశనం జరుగును. ధనలాభం చేకూరుతుంది. శృంగారాది విషయాలలో సుఖం చేకూరుతుంది. స్త్రీల వలన సౌఖ్యం కూడా కలుగుతుంది. 

ఏకాదశ స్థానములో గురు గ్రహం అనుకూల ప్రాప్తిని కలుగజేయడం వల్ల ముఖ్యంగా ఏకాదశ స్థానం పూర్వజన్మ పుణ్య ఫల స్థానం కావడం చేత వీరు పూర్వజన్మమందు చేసిన పుణ్యఫల కార్యముల వల్ల గురువు ఈ రాశివారికి ఈ సంధర్భములో పూర్వ జన్మలో చేసిన పుణ్యకర్మల ఫలితాలను ప్రాప్తింపజేయుట వల్ల జాతకులు ఏ కార్యాన్ని అయితే తాము ఇష్టపూర్వకంగా చేయుదురో ఆ కార్యసిద్ధి ఈ కాలంలో సిద్ధిస్తుంది (ఇష్ట కార్య సిద్ధి). సంఘంలో పదవి, ఉద్యోగాలలో విశేష స్థానం దక్కుటకు అవకాశములు మెండుగా ఉండును.

దశమ స్థానంలో శని ప్రతికూలుడు. అందుకారణంగా ఈ 15 రోజులలో శని వలన ప్రతికూల సంఘటనలు ఎదురగును. బి‌పి సమస్యలు ఉంటాయి. వీరి విద్వత్తుకి, కీర్తి ప్రతిష్టలకు, వీరి వద్దనున్న ధనముకు హాని జరుగును. విద్యాది విషయాలకు సమస్యలు కలుగును (విద్యార్థులకు). విద్యార్థులకు మంచి కాలం కాదు. శని అనుగ్రహమును పొందుటకు తిలకాష్టబలిని నిర్వహించుకొనిన శని ఇచ్చేడి చెడు ఫలితాలను నివారించవచ్చు. వ్యక్తిగత తిలకాష్టబలి అనగా- రాశి వారు (జాతకులు) తాము ఎంత బరువు ఉన్నారో అందులో 8వ వంతు దిష్టి దిగదుడుపు తీయించి వాటిని దక్షిణ ప్రదేశంలో ఆహుతి చేయవలెను. 8వ వంతు చేయలేనివారు, 8వ వంతులో 8వ వంతు చేయుట ఉత్తమం.

కుజగ్రహం అష్టమ స్థానంలో ఉండుట మిక్కిలి ప్రమాదములు కలుగుజేయుట వల్ల రక్తపు సెగ గడ్డలు రావడం, గాయాలు కావడం, ప్రమాదముల కారణముగా ఎముకలు విరుగుట, విష కీటకాదుల వల్ల, విష పధార్థాల వల్ల ప్రాణహాని వాటిల్లును. దీనికి పరిహారముగా అష్టమంగళ బలి చేయించుట వల్ల కుజుని ప్రతికూల సంఘటనలను నివారించుకోవచ్చు.అష్టమంగళ బలి- పగడపు మాలను కుజగ్రహ బీజ మంత్రముతో 81 సార్లు జపించవలెను. సాధ్యం గాని వారు తమలపాకు మాలను ఆంజనేయ స్వామికి సమర్పించాలి.

శుక్ర గ్రహం 9వ స్థానములో ఆనందదాయకమైన, అనుకూలమైన, సంతోష దాయకమైన, సుఖదాయకమైన ఫలితములను ఇవ్వడం జరుగుతుంది. శుక్రుని అనుకూలత వల్ల ఈ 15 రోజులలో కొన్ని సమయాలలో ధన లాభాన్ని పొందుతారు. ధర్మం కోసం. ధార్మికుల కోసం చేయు కార్యక్రమములు విజయవంతం అయ్యి వాటి యొక్క పుణ్యఫలం ఆనందాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ధార్మిక కార్యం వల్ల ధార్మికులకు సౌఖ్యం చేకూరుతుంది. కొన్ని కార్యములు సాధిస్తారు. విశేషించి స్త్రీ సంభోగం, సుఖం కలుగును. ఈ గ్రహముల అనుకూల ప్రతికూల సంఘటనలు ఈ 15 రోజులు ప్రత్యేకించి ఏ దినములలో ఫలింపజేయునో సూక్ష్మ వేద గణితము వల్ల తెలుసుకోవచ్చును. ఆ ఫలిత దినములు ఎప్పుడు తెలియ పరిచేందుకు నాకు కాల వ్యవధి లేక క్లుప్తముగా వివరించాను.

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Leave a Reply