ధనస్సు రాశి గోచార ఫలితములు

జనవరి 1, 2022  నుండి జనవరి 31, 2022 వరకు గల గ్రహస్థితుల ద్వాదశ రాశుల వారికి గ్రహ గోచార ఫలితాలు. 

ధనస్సు రాశి

రవి గ్రహం జన్మ స్థానము నందు అనగా తనుభావంలో ఉండటం వల్ల ఈ 15 రోజుల్లో మిక్కిలి ప్రతికూలుడే. ఈ రవి గ్రహ ప్రతికూలత చేత వ్యక్తులకు ఉష్ణ సంబంధిత ప్రకోపములు సంభవించడం వల్ల కష్టములు సంభవిస్తాయి. ఆ తరువాత రవి మకరంలోకి 2వ భావములోకి ప్రవేశించగా, దాని వల్ల ధన నష్టం, నేత్ర రోగ బాధలు కలుగును. 

కుజుడు 12వ స్థానంలో ఉండటం వల్ల యోగమునకు చెరుపు పట్టించును. భూ సంబంధిత వ్యవహారాల వల్ల ధనము వ్యయం అవును. నేత్రములకు కలిగే ఇబ్బందుల వల్ల ఈ రాశుల వారు సమస్యలకు గురి అవుతారు. రక్తదోష సంబంధిత సమస్యల వల్ల శరేరానికి కొంచెం నలత చేయును.

బుధుడు 2వ స్థానంలో ఉండుట వల్ల ధనప్రాప్తి కలుగును. వీరి మాటకు విలువ పెరుగును. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

గురువు 3వ భావంలో ఉండినందున స్థాన భ్రష్టం, కార్య విజ్ఞములు కలుగును.

దంపతుల మధ్య సాంగత్యం, ఆహార సౌఖ్యం, సుగంధ ద్రవ్యములు, మంచములు వంటి సామానులు లబ్ధి పొందును. విశేషముగా వస్త్ర లాభం పొందుతారు.

శని 3వ భావములో ఉండినందున ధన, ధాన్య వృద్ధి, పుష్పములు, రత్నములు ఉన్నగు అలంకార సిద్ధి, ఉన్నత పదవి గల స్త్రీల వలన కుటుంబ సౌఖ్యం కలుగును.

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Leave a Reply