పితృ దోష నివృత్తి హోమం

                                                             పితృ దోష నివృత్తి హోమం

పూర్వీకులు చేసిన చెడు కర్మల ఫలితాలను వారి వారసులు ఈ పితృ దోషం రూపములో ఫలితములు అనుభవిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే మనం పూర్వ జన్మలో చేసిన కర్మలకు ఇప్పుడు అనగా ఈ జన్మలో అనుభవిస్తాము అని అర్థం. పితృదోషం ఉన్న జాతకులు ఆ దోష ప్రభావాన్ని పూర్తిగా అనుభవించి గాని, మంచి కార్యాలను చేస్తూ, ప్రాయశ్చిత్త పరిహారాలు చేయడం వల్ల గాని పితృ దోషం నివృత్తి అవుతుంది. ఈ ఐహిక ప్రపంచంలో పూర్వీకుల నుండి వంశపార పర్యంగా వచ్చే ఆస్తి, అంతస్తులను వారి వారసులు ఎలా అయితే తీసుకుంటున్నారో, అదే విధంగా వారి పూర్వీకులు చేసిన కర్మల ఫలితాలను కూడా స్వీకరించాల్సి ఉంటుంది.

         పూర్వీకులు చేసిన పాపముల వల్ల పితృ దోషం ఏర్పడుతుంది. జాతకుని జన్మకుండలిలో ఏ గ్రహం వల్ల అయితే పితృ దోషం ఏర్పడిందో, ఆ గ్రహానికి సంబంధించిన అధి దేవతను ప్రార్థించి వేడుకోవాలి. పూజాది హోమ కార్యక్రమములు జరిపించాలి. ఆ విధంగా జరుపకుండా నిర్లక్ష్యం చేసినట్లైతే,  ఈ పితృ దోషం జాతకుని తరువాత వచ్చే తరాల వారి జన్మకుండలిలో కూడా పితృ దోషం కనబడుతూ, ఆ పితృ దోషం యొక్క ప్రభావాన్ని ఎదుర్కొని బాధలు పడాల్సి ఉంటుంది.

 

         జన్మకుండలిలో 9వ భావంలో పైశాచిక గ్రహాలు ఉన్నప్పుడు గాని లేదా నవమాధిపతి శత్రు, నీచ స్థానంలో లేదా వక్ర స్థితిలో ఉన్నప్పుడు గాని జాతకునికి పితృ దోషం ఉన్నట్టు నిర్ధారించాలి. రవి, చంద్ర, గురు, శని, రాహు, కేతు, బుధ గ్రహాలు ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు, ఆ గ్రహాల శత్రు గ్రహాలతో కలసి ఉన్నప్పుడు గాని, లేదా వక్ర స్థానంలో ఉన్నప్పుడు గాని పితృ దోషమును జన్మకుండలిలో జ్యోతిష్యులు గుర్తిస్తారు. పితృదోషమును ప్రేరేపించడానికి కొన్ని లగ్నాలకు రవి, కుజ, శని గ్రహాలు యోగ కారకులుగా వ్యవహరిస్తాయి. జన్మకుండలిలో పితృదోషం ఉన్నట్టు ఎప్పుడైతే గుర్తిస్తారో, వెంటనే వామతంత్ర ఆచారంలో పితృదోష నివారణా హోమమును జరిపించుకొని, దోష నివృత్తి చేసుకోవాలి.

[పితృదోషం- ప్రభావముల గురించి పూర్తి వివరణ, ఎలాంటి గ్రహస్తితిగతుల వల్ల పితృ దోషం ఏర్పడుతుందో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు]

పితృదోషం వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి?

పితృదోషం ఉన్న జాతకులకు శరీరకంగా, మానసికంగా అనుకోని చెడు ప్రభావాలు పడతాయి. శారీరకంగా వైకల్యం రావడం లేదా వ్యాధి బారీన పడటం లాంటివి జరుగుతాయి. ఏదైనా వ్యాధి పారంపర్యంగా తరువాతి తరం వారికి రావడం లాంటివి జరుగుతాయి. పితృదోషం ఉన్న జాతకుల కుటుంబములోని వ్యక్తులు పదే పదే చేతబడి ప్రయోగానికి గురి అవుతూ ఉంటారు. కారణంగా ఆరోగ్యం నశిస్తుంది.

[పితృదోషం- ప్రభావముల గురించి పూర్తి వివరణ, ఎలాంటి గ్రహస్తితిగతుల వల్ల పితృ దోషం ఏర్పడుతుందో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు]

చదువు, వృత్తి, ఉద్యోగం పరంగా ఎదురయ్యే సమస్యలు:

పితృదోషం ఉన్న జాతకులు ఎలాంటి పరీక్షల్లో అయినా ఫెయిల్ అవటం, పై చదువుల కొరకు ఎలాంటి ప్రోత్సాహం జాతకులకు లభించకపోవడం, చదువు పరంగా, వృత్తి పరంగా నిత్యం అపజయం పాలవటం, ఉద్యోగం స్థిరంగా ఉండకపోవడం, ప్రమోషన్లకు తీవ్రమైన ఆటంకాలు రావడం లాంటివి జరుగుతాయి.

పితృదోషం వల్ల భార్యా భర్తల మధ్య ప్రేమ తగ్గిపోవడం, వివాహం ఆలస్యం కావడం, వైవాహిక జీవితం సాఫీగా లేకపోవడం, శృంగార జీవితంలో ఆనందం లేకపోవడం వల్ల అసంతృప్తి కలగడం, సంతాన సాఫల్యత లేకపోవడం, పదే పదే గర్భస్రావాలు జరగడం, చిన్నతనంలోనే సంతానం మరణించడం, గోత్రం వంశం కొనసాగించేందుకు పుత్ర యోగం లేకపోవటం, దంపతుల మధ్య ప్రేమానుబంధం లేకపోవటం, వివాహేతర సంబంధాలు ఏర్పడటం, విడాకులు జరగడం లాంటి తీవ్రమైన సమస్యలు పితృ దోషం ఉన్న జాతకులకు ఎదురవుతాయి.

ఆర్థికపరమైన సమస్యలు:     

ఆర్థిక పరమైన అభివృద్ధి లోపించడమే కాక, ఆర్థిక స్థిరత్వం ఉండదు. తీవ్రమైన అప్పులు ఎదురవడం వల్ల పేదరికం అనుభవించాల్సి వస్తుంది. పూర్వీకుల ఆస్తుల విషయాలలో ఎన్నో సమస్యలు వస్తాయి. డబ్బు రూపంలో వచ్చే లాభాలను చేతి దాకా వచ్చినా చేజార్చుకుంటారు.

ముఖ్య గమనిక: జన్మకుండలిలో ఏ గ్రహం వల్ల పితృదోషం ఏర్పడిందో తెలుసుకోవాలి. ఎందుకనగా ఏ గ్రహం వల్ల అయితే పితృదోషం ఏర్పడిందో ఆ గ్రహ దశ, అంతర్దశ, గోచార సమయంలో ఈ దోష ప్రభావం జాతకులపై పడి, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

[పితృదోషం- ప్రభావముల గురించి పూర్తి వివరణ, ఎలాంటి గ్రహస్తితిగతుల వల్ల పితృ దోషం ఏర్పడుతుందో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు]

పరిహారం: 

పితృదోషం వల్ల ఇక్కడ వివరించిన సమస్యలు ఎదుర్కొంటున్న జాతకులు వెంటనే వామతంత్ర ఆచారం ప్రకారం పితృదోష నివృత్తి హోమమును ఖచ్చితంగా జరిపించుకోవాలి. ఈ పితృదోష నివృత్తి హోమమును జరిపిస్తే పితృదేవతలు తమ వారసుల పై తమ అనుగ్రహాన్ని కురిపిస్తారు. పితృదేవతలు తమ వారసులు నిర్వహించుకునే పనులలో విజయం సాధించుకునేందుకు పరోక్షంగా సహాయపడి వారికి విజయం చేకూరేలా అనుగ్రహిస్తారు. తత్కారణంగా పనులకు ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి విజయం లభిస్తుంది. వామతంత్ర ఆచారం ప్రకారం చేసీ పితృదోష నివృత్తి హోమము ఎంతో శక్తివంతమైనది. ఈ హోమం ఆరోగ్యపరమైన తీవ్ర సమస్యలను సైతం పారద్రోలుతుంది. ధీర్ఘ వ్యాధులు నుండి ఉపశమనం పొందుతారు.వ్యాపారంలో లాభాలు అమితంగా రావాలన్నా పితృదోషం ఉన్న జాతకులు ఈ పితృదోష నివృత్తి హోమమును తప్పక జరిపించాలి.    

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Leave a Reply