అన్య స్త్రీ/పురుష సంబంధ అవయోగాలు

        సాధరణంగా వివాహం తరువాత పురుషుడు అన్యస్త్రీ సంబంధాలను కలిగి ఉండటం వల్ల ఆ పురుషుడిని నిందించడం జరుగుతుంది. మగ బుద్ధి పాడు బుద్ధి అంటూ దూషిస్తారు. ఇవే సంఘటనలు స్త్రీల విషయంలో జరిగితే స్త్రీ బుద్ధి ప్రళయాంతకః అని నిందిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్త్రీ, పురుషులు ఇద్దరూ కూడానూ వారివారి గత జన్మ ప్రారబ్ధ కర్మను అనుభవించడానికే జన్మిస్తారు. వారి ప్రారబ్ధ కర్మను అనుభవించి జీవితంలో ఎన్నో పరాభవాలు, అవమానాలు, చట్ట సంబంధమైన ప్రతికూల సంఘటనలను ఎదుర్కొంటారు. ఒకరికొకరు దూషించుకోవడం పరిపాటి.  ఏది ఏమైనప్పటికి ఈ అవయోగాలు కలిగినపుడు వాటికి పరిష్కారం తప్పక చేసుకోవాలి. మనిషి తన కర్మను నియంత్రించడం సాధ్యం కాని విషయం. తాను ఎదుర్కొంటున్న చెడుకర్మను నిర్మూలించుకోవడానికి ఆ చెడు కర్మ ఏర్పడటానికి గల గ్రహస్థితులు జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి! కర్మను నియంత్రించలేము, కాని ఏర్పడిన చెడు స్థితిని నివారించవచ్చా?

                ఎవరు చేసేది వాళ్ళకి ధర్మం, ఈ విషయంలో మంచి చెడులను నిర్దేశించగల శక్తి, నియంత్రించగల శక్తి మానవమాత్రులకు సాధ్యం కాదు. వ్యక్తులకు ప్రాప్తించే రోగాలు, వ్యాధులను రాకుండా నివారించలేము. సోకిన రోగాన్ని నివారణ చేయటానికి ప్రయత్నించగలము. ఇందులో సూక్ష్మం మీకు అర్థమయ్యే ఉంటుంది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకోగల శక్తి జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. కానీ ప్రపంచానికి జరగబోయే వినాశనాన్ని లెక్కించగల, గ్రహించగల శక్తి అతీంద్రియ జ్ఞానం ఉన్నవారికే సాధ్యపడుతుంది. జ్యోతిష్యశాస్త్రం తెలిసిన ప్రతీవారికి ఇది సాధ్యం కాదు. వారి వారి పరిజ్ఞానం, పరిమితంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ప్రపంచానికి జరగబోయే అంశాల కన్నా ముందు మనం ఎదుర్కొంటూ అవయోగాలను పరిష్కరించుకుందాం! చక్కటి పధార్థాలు, అనుభవం, శక్తి ఉన్నవారు చేసే వంట చాలా రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. అదే విధంగా శాస్త్రంపై నమ్మకం, అంకిత భావం, సంపూర్ణ శాస్త్ర జ్ఞానం ఉన్నవారు ఆచరించే పూజాది/ హోమ క్రతువులు శీఘ్రంగా సత్ఫలితాలను ఇస్తాయి. ఈ సృష్టిలో జరిగే ప్రతిక్రియకు గ్రహాలే కారణ భూతమవుతాయి. వితండవాదాలకు నాస్తికులకు, ఆజ్ఞనులకు ఇది మెట్ట వేదాంతంగా ఉంటుంది. ఒక సైంటిస్టుకు ఉన్న పరిజ్ఞానం, శాస్త్ర జ్ఞానం అందరికీ ఉండదు. సైన్సు చాలా గొప్పది. అంతా సైన్సే! దేవుడు లేడు అంతా త్రాష్ అని చెప్పుకుంటూ, కొంతమందికి వారి చివరి దశలో ఈ సృష్టిని నడిపించేది ఏదో శక్తి అని చెప్పడం జరిగింది.

అన్య స్త్రీ/పురుష సాంగత్యాలకు జ్యోతిష పరిభాషలలో వ్యభిచార యోగమని పిలుస్తారు. జన్మకుండలిలో 7వ స్థానంలో శుక్రుడు ఉన్న ఆ స్థానం, మకర, కుంభములైతే శని, లేదా కుజుని చేత చూడబడితే ఆ పురుషుడు వ్యభిచారి అవుతాడు. శని, కుజులు చంద్రునితో గూడి ఒకే రాశిలో ఉండినా/ మకర, కుంభ, మేష, వృశ్చిక రాశులు 7వ స్థానములో ఆ రాశులలో ఉన్న శుక్రుడిని, శని, కుజులు చూస్తున్నప్పుడు, భార్యతో సహా అనగా భార్యా భర్తలిరువురూ ఎవరి ఇష్టానుసారంగా వారు అన్న సంపర్కములు సాగిస్తారు. పురుషుని జన్మకుండలిలో చంద్రుడు, మేష, వృశ్చిక, మకర, కుంభ రాశులలో ఉండి, అది 7వ రాశియై ఉండి, శని, లేదా కుజునితో వీక్షింపబడుతున్న ఆ పురుషునికి యొక్క అన్య పురుష సంపర్కములు కలిగి ఉంటుంది. ఇలాంటి గ్రహస్థితులు గల వ్యక్తులు ఈ అవయోగాలు ఎదురువ్వక ముందే పరిహారములు జరిపించువుకోవడం మంచిది. వీరికి ఈ దోషం నివారణ అయిన తరువాత వివాహం చేసుకోవడం మేలు.

 

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com