కళత్రదోషము అంటే ఏమిటి? ఆ కళత్ర దోషము వలన కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి?

కళత్రము అంటే భార్య అని అర్థం. పురుషుల జన్మకుండలిలో భార్యను గూర్చి తెలియజేసే, ప్రభావితం చేసే గ్రహము శుక్రుడు. శుక్రుడు కళత్ర కారకుడు. పురుషుని జన్మకుండలిలో 7వ స్థానమును కళత్రస్థానం అని పిలుస్తారు. జన్మకుండలిలో సప్తమ భావములో చెడు గ్రహము ఉన్నట్లైతే ఆ కళత్ర స్థానం దెబ్బ తింటుంది. జన్మకుండలిలో సప్తమ భావములో చెడు గ్రహము మరియు శుక్రుడు ఉన్న స్థానము చెడు స్థానము ఉన్నట్లైతే ఆ జాతకులకు కళత్ర దోషము ఏర్పడుతుంది. కళత్రదోషము ఏర్పడటం వలన జాతకునికి వివాహము ఆలస్యము అవుతుంది. అంతేకాకుండా సరైన భార్య దొరకటం దాదాపు అసాధ్యం అవుతుంది. ఒకవేళ విధివశాత్తు ఆ జాతకునికి వివాహము జరిగినా వివాహము జరిగిన కొద్ది రోజులలోనే భార్యతో విభేదాలు తలెత్తి విడిపోయే పరిస్తితి ఏర్పడుతుంది. కళత్ర దోషము ఉన్నవారికి సరైన సంసార సుఖము లభించదనే చెప్పాలి. కొంతమంది జన్మకుండలిలో కళత్ర దోషము ఉన్నవారి భార్యకు తరచూ అనారోగ్యములు కలుగటం లేదా అకాల మరణం పొందటం లాంటివి జరుగుతాయి.

kalatra dosham

కళత్రదోషం ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. వివాహం ఆలస్యము కావటం; విచారపూరితమైన దాంపత్య జీవితం ఏర్పడటం; భార్యతో తరచుగా అపార్థాలు రావటం; దాంపత్య సుఖము లేకపోవటం; భార్యకు దూరంగా ఉండటం; భార్యతో విడాకులు ఏర్పడటం; భార్య అకాల మరణం పొందటం లాంటి పరిస్థితులు కళత్ర దోషము ఉన్నవారికి ఏర్పడతాయి.

  1. పైశాచిక శుక్ర పీడా నివారణా గంధర్వ తంత్ర హోమము

పురుషుని జన్మకుండలిలో కుజుడు  సప్తమ భావములో ఉంటే ఆ జాతకులకు కళత్ర దోషం ఏర్పడుతుంది. ఈ జాతకులు తమ భార్యతో తగాదాలు పెట్టుకొని విడిపోయే సంధర్భాలు ఎదురవుతాయి. భార్యకు తీవ్ర అనారోగ్యములు కలుగుతాయి.

  1. కళత్ర స్థాన కుజ గ్రహ సంతుష్ట హోమం

పురుషుని జన్మకుండలిలో సప్తమ భావములో శని ఉంటే  వారికి కళత్ర దోషం ఏర్పడుతుంది. దీనినే శని దోషం అని కూడా పిలుస్తారు. ఈ శని దోషం వలన జాతకులకు ఆలస్య వివాహం జరగటమే కాకుండా కనీసం 30 సంవత్సరాలు దాటిన తరువాతే వివాహము జరిగే అవకాశము ఉంటుంది. శని దోషమునకు తోడుగా శని మీద ఇతర పాప గ్రహముల దృష్టి పడినట్లైతే ఆ జాతకుడు తనకన్నా వయస్సులో పెద్దది అయిన స్త్రీతో వివాహము జరుగుతుంది. శనిదోషము ఉన్న పురుషులకు ఆలస్య వివాహమే కాకుండా భార్య నలుపు రంగులో ఉండటం గాని;  సంపదలో గాని , సాంఘిక స్థాయిలో జాతకుల కంటే తక్కువ స్థాయిలో ఉండటం జరుగుతుంది. ఈడుజోడు కుదరని జంట అయిన కారణంగా ఆ దంపతుల మధ్య నిజమైన ప్రేమాభిమానములు ఉండవు.

  1. వైవాహిక స్థాన శని గ్రహ వక్ర పీడా నివారణా హోమం

రాహువు లేదా కేతువు పురుషుని జాతకములో సప్తమ భావములో ఉన్నట్లైతే కళత్ర దోషము ఏర్పడుతుంది. ఫలితంగా వివాహము జరుగటం కష్టం. వివాహము అయిన తరువాత వైవాహిక జీవితం దౌర్భాగ్యంగా ఉంటుంది. రాహువు లేదా కేతువు వలన ఏర్పడే కళత్ర దోషమును నాగదోషం అని కూడా పిలుస్తారు.

  1. సప్తమ స్థాన మాంగల్య కళత్ర రాహు పైశాచిక పీడా నివారణ హోమం
  2. ధూమ్ర కేతు హోమం
  3. ఆశ్లేష బలి, నవనాగమండలం (నాగదోషం)

 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles: