ఆశ్లేష బలి, నవనాగమండలం, సర్పబలి

కాలసర్ప దోషం-? కాలసర్పంలో ‘కాల’ అంటే కాలము అని, ‘సర్పం’ అంటే పాము అని అర్థం. కాలసర్పము అనగా కాలము సర్పముగా మారి మానవుడిని అనేక రకముల కష్టాలపాలు చేయటాన్నే కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం అని అంటారు. జన్మకుండలిలో (జాతకచక్రంలో) రాహువు మరియు కేతువు వీటి వలన కాలసర్పదోషం ఏర్పడుతుందని వరాహమిహరుడు, పరాశర మహర్షి తెలియపరచారు. కాలసర్పయోగం ఉన్నవారు తమతమ వృత్తులలో పైకి రావడానికి ఎంతో అధికమైన శ్రమపడాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు ఎంతటి అధికమైన శ్రమ అనుభవించినా, ఆ శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

ఈ కాలసర్పయోగం ఉన్న జాతకుల యొక్క వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని, దోషాలను చూపిస్తారు. కాలసర్పయోగం ఉన్న వారు, వారి వారి వృత్తి వ్యాపారాలలో అకస్మాత్తుగా అంచలంచాలుగా పెరిగి అంతకన్నా హఠాత్తుగా పతనం అవుతారు. కాలసర్పయోగం తీవ్రంగా ఉన్నప్పుడు జాతకుడు కొన్నిసార్లు మరణ గండాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబానికి దూరం కావడం పెద్దమొత్తంలో ఆస్తిని కోల్పోవడం, నిష్కారణంగా అపకీర్తిని పొందడం, ఊహించని విధంగా ప్రమాదలకు గురి కావడం చట్టవిరుద్ధమైన మరియు అవినీతి కార్యాలకు పాల్పడి శిక్షలకు గురి కావడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.

Ashlesha Bali

Related Articles:

             ఈ కాలసర్పయోగం వల్ల మనిషి తాను చేసే కార్యాలకు ఫలితం పొందలేకపోవడం, కొందరికి వివాహం కాకపోవడం, సంతానం కలుగక పోవడం తరచూ తగాదాలలో, కోర్టు కేసులలో ఇరుక్కుపోవడం, శత్రువుల పీడ అధికంగా ఉండటం లాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతుంది. మనిషికి రావాల్సిన శుభాన్ని అదృష్టాన్ని అడ్డగించడంలో కాలసర్పదోషం పోషించే పాత్ర అంతా ఇంతా కాదు. ఈ కాలసర్పదోషానికి మనిషి యొక్క మంచి, చెడులతో సంబంధం లేదా పేద, ధనిక అన్న భేదం కూడా లేదు. కాలసర్పదోషం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ యోగ ప్రభావానికి గురి కావాల్సిందే. కాలసర్పదోషం ఉన్న సంపన్నులు అనుక్షణం ఏదో ఒక విషయములతో ఉత్కంఠను, ఆందోళనలను అనుభవిస్తూ ఉంటారు. వారిని అనుక్షణం ఏదో ఒక అభద్రతా భావం వెంటాడుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎన్నో దుష్ట యోగాలు ఉన్నప్పటికి వాటి అన్నింటిలోనూ తీవ్రమైనది కాలసర్పదోషం. ఒక్కోరకమైన కాలసర్పదోషం మనిషికి ఒక్కో వయసు వరకు ప్రభావం ఉంటుంది, కొన్ని కాలసర్పదోషాలు మాత్రం మనిషి జీవితంలో ఏదో ఒక దశలో తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయి. భారతదేశంలో సర్పదోష నిర్మూలనకు చాలా విధాలుగా పరిహారాములు జరిపిస్తున్నారు. వీటిలో కొన్ని మాత్రమే సఫలీకృతం అవుతున్నాయి. మరికొంత మంది చేసుకున్న కాలసర్పదోష పరిహారాలు బూడిదలో పోసిన పన్నీరే. కారణం ఏమిటంటే, కాలసర్పదోష పరిహారాదులకు జరిపించవలసిన వాటిలో ప్రధానమైనది ఆశ్లేష బలి, నవనాగమండలం . ఈ రెండూ కూడాను చాలా శక్తివంతమైన కాలసర్పదోష పరిహారములు. ఈ రెండూ సర్పతాంత్రిక పీఠాలలో, సర్ప దేవతల క్షేత్రములో, నదీ మరియు సాగర తీరములందు మాత్రమే జరిపించాలి. అలా కాకుండా సామూహికంగాను, గృహాలలోనూ, మరే ఇతర ప్రదేశాలలో ఈ కార్యములు నిర్వహించకూడదని శాస్త్ర నియమం. సర్పతాంత్రికులు, సర్ప పీఠాలలో చేసే నవనాగమండలం, ఆశ్లేష బలి పూజాది కార్యములకు మాత్రమే సత్ఫలితాలు పొందడం జరుగుతుంది.తీవ్రమైన కాలసర్పదోషం, నాగ శాపం, నాగ దోషం, రాహు గ్రహ నాగదోషం, కేతు గ్రస్త సర్పదోషం సంపూర్ణంగా తొలగిపోవాలంటే ఆశ్లేష బలి, నవనాగమండలం పూజను తప్పనిసరిగా జరిపించుకోవాలి. జాతకులు ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని మరియు వ్యక్తిగతంగా గాని ఈ పూజను నిర్వహించుకోవడం మంచిది. సామూహికంగా జరిగే పూజలో ఒకరి దోషాలు మరొకరికి బట్వాడా కాబడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా దోషం నిర్మూలన కాకపోగా ఇతరుల దోషాలు సంక్రమించే అవకాశం. వారు ఎదుర్కొంటున్న దుష్పరిణామాలను కూడా పంచుకునే భాగాస్వాములు జరిగే అవకాశాలు మెండు. అందుకరణం చేత సర్పదోష పరిహారాలు వ్యక్తిగతంగా చేయించుకోవడం ఉత్తమం.

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com